పాత నేరస్తులపై స్పెషల్ ఫోకస్..!
– వారి కదలికలతో రౌడీషీడ్, పీడియాక్టుపై దృష్టి
– మహిళలు, అమ్మాయిలను వేధిస్తే కఠినమైన చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో పాత నేరస్తులపై స్పెషల్ ఫోకస్ ఉంచాలని, వారి కదలికలు గమనిస్తూ అవసరమైతే రౌడీషీట్, పీడీ యాక్టు ప్రయోగానికి చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి జిల్లాలోని వివిధ డివిజన్ల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులలో ఎలక్షన్స్ రానున్నందున ప్రతి ఒక్కరు ఎలక్షన్ సంబంధిత విషయాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలాని అన్నారు. గత ఎన్నికల సమయంలో జరిగిన సంఘనలు, కేసుల పునఃపరిశీలన చేసుకోవాలన్నారు. ఎన్‌డబ్ల్యూ, పాత నేరస్థులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వారి కదలికలు గమనిస్తూ ఉండాలన్నారు.
మహిళా సంబందించిన కేసులకు పాల్పడే నేరస్థులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని, వారి నేర చరిత్రను బట్టి వారిపైన రౌడీ షీట్ లు, పిడి ఆక్ట్ లు కూడా ఏర్పాటు కు రికార్డు ను తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయం సమీపంలో ఉన్నందున అందరు అప్రమత్తంగా విధులు చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
అక్రమ రవాణాపై దృష్టి
అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు దృష్టిసారించాలన్నారు. ఇసుక రవాణాతో పాటు గుట్కా, పీడీఎస్ రైస్ రవాణాపై కఠినంగా వ్యవహరించాలన్నారు. దీంతో పాటు వీకెండ్ లలో డ్రంక్ & డ్రైవ్, ఓపెన్ బుజింగ్ మరియు వెహికిల్ చెకింగ్ ను ఏర్పాటు చేసుకోవాలని, E-petty కేసుల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు.
నేరాల నియంత్రణకు చర్యలు
అనంతరం వివిధ ఫోలీస్టేషన్లలో నమోదు అయినా కేసుల వివరాలను తెలసుకున్న ఎస్పీ కోటిరెడ్డి పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలని అదేశించారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలపై కారణాలు తెలుసుకొని వాటిని తగ్గించాలని అన్నారు. అధికంగా నమోదు అవుతున్న పోలీస్ స్టేషన్లలో కళాజాత బృందాలతో ప్రజల్లో అవగాహన కల్పించాన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్న హాట్ స్పాట్ లను గుర్తించి అట్టి ప్రాంతాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
పట్టణాల్లో, గ్రామాల్లో సీసీటీవీల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులందరు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసుల యొక్క కన్వెక్షన్ శాతాన్ని పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె.శ్రీనివాస్ రావు, డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, వికారాబాద్ సబ్ డీవిజన్ అదనపు ఎస్పీ సత్యనారాయణ, పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, జిల్లా ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


