తాండూరులో ఫోక్సో కేసు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో ఫోక్సో కేసు
– మైనర్‌ బాలికతో మైనర్ బాలుడి ప్రేమ
– లైంగికదాడితో గర్బం దాల్చిన బాలిక
– తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో ఫోక్సో కేసు నమోదయ్యింది.

పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడు అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడు. ప్రేమ ముసుగులో బాలుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ ఇద్దరి విషయం బాలిక ఇంట్లో తెలిసింది. బాలుడితో వివాహానికి బాలిక తల్లి నిరాకరించింది. దీంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులకు అనుమానం రావడంతో వైద్య పరీక్షలు చేయించారు.

దీంతో బాలిక 4నెలల గర్బవతి అని తేలింది. బాలిక తల్లి తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనర్ బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

బ్యాగులో ఎండు గంజాయి