పోట్లీ మహారాజ్‌ ఆలయానికి పునర్నిర్మాణ శోభ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పోట్లీ మహారాజ్‌ ఆలయానికి పునర్నిర్మాణ శోభ..!
– 15న నూతన నిర్మాణాల ప్రారంభోత్సవంకు ఏర్పాట్లు పూర్తి
– దేవాలయ చైర్మన్‌ ఎస్‌. ప్రసాద్‌గౌడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని పోట్లీ మహారాజ్‌ దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన నూతన నిర్మాణాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ ఎస్‌. ప్రసాద్‌గౌడ్‌ తెలిపారు. నూతన నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో ఆలయ అభివృద్ధిలో మరో ముందడుగు పడనుందని పేర్కొన్నారు.
దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన నిర్మాణాల ప్రారంభోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రసాద్‌గౌడ్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, శ్రేయోభిలాషులు, ఆధ్యాత్మిక అభిమానులు కుటుంబ సమేతంగా పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

పోట్లీ మహారాజ్‌ భక్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

Pvr

ఎఫ్‌ఎంజీ వైద్యుల పట్ల వివక్ష తగదు!