ఎఫ్‌ఎంజీ వైద్యుల పట్ల వివక్ష తగదు!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎఫ్‌ఎంజీ వైద్యుల పట్ల వివక్ష తగదు!
– సమాన స్టైపెండ్‌, బకాయిలు చెల్లించాలి
– ఈ నెల 14లోగా ఉత్తర్వులు జారీ చేయాలి
– టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి డిమాండ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న విదేశీ వైద్య పట్టభద్రుల (ఎఫ్‌ఎంజీ) ఇంటర్న్‌లకు సమాన స్టైపెండ్‌ చెల్లించాలని టీఆర్‌ఎస్‌వీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక వైద్య ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎంజీలకు నెలకు రూ.29,792 చెల్లించాలని కోరారు.

ప్రస్తుతం కొందరికి రూ.5 వేలు మాత్రమే ఇస్తుండగా, మరికొందరికి స్టైపెండ్‌ అందడం లేదని పేర్కొన్నారు. సెప్టెంబరు 23న వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి వినతిపత్రం సమర్పించినా పరిష్కారం లభించలేదన్నారు. ఈ నెల 14లోగా సమాన స్టైపెండ్‌తోపాటు జనవరి నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 14న కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం వద్ద చేపట్టే శాంతియుత నిరసనకు మద్దతు ఇస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Pvr

కుమ్మరి బిచ్చమ్మ ఇంటికి కుంపటి..!