భవానీ మాతను దర్శించుకున్న శంకర్ యాదవ్
– మిత్ర బృందంతో ప్రత్యేక పూజలు
– ఘనంగా సన్మానించిన నిర్వాహకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని బసవన్న కట్ట వద్ద ప్రతిష్ఠించిన భవానీ మాతను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్ శనివారం దర్శించుకున్నారు.

తన మిత్ర బృందంతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, అమ్మవారి ఆరాధనతో ప్రజల్లో భక్తిభావం, ఐక్యత పెంపొందుతాయని అన్నారు. భవానీ మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగలను అందరూ కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్లోళ్ల నర్సింలు, ప్రభాకర్ గౌడ్, బంటు మల్లప్ప, సంతోష్ గౌడ్, మహేష్ ఠాకూర్, రుద్రు పాటిల్, చంటి యాదవ్, రజనీకాంత్, జొన్నల వినోద్ కుమార్, వెంకటేష్ చారితో పాటు పలువురు మిత్రులు, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.


