విశ్వకర్మల గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించండి
– నూతన ఎమ్మెల్సీలను కోరిన విశ్వకర్మ సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో విశ్వకర్మ గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను సంఘం సభ్యులు కోరారు.
సోమవారం హైదరాబాద్‌లో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ స్పీకర్ మధుసూదనా చారినికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను కూడ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి పుష్చగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాండూరులోని విశ్వకర్మల గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు మాజీ స్పీకర్ మధుసూదనచారితో పాటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు స్పందించి గుట్ట అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు సంఘం సభ్యులు తెలిపారు. వారిని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి, జి. శ్రీనివాస్ చారి, డాక్టర్ జయప్రసాద్, సభ్యులు యాదగిరిచారి, బాలు చారి, పులిందర్ చారి, సుధాకర్ చారి, వడ్డ శ్రీనివాస్ చారి, తదితరులు ఉన్నారు.


