వానరంకు ప్రాణవాయువందించాడు
– కొనఊపిరితో కోలుకున్న కోతి
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
దర్శని డెస్క్: సాంకేతిక ప్రపంచంలో మనషులకు మనిషి సాయం చేసే సంస్కృతిని మెల్లగా మాయపోతుంది. ఎక్కడో కొన్ని చోట్ల కొందరు మానవత్వం చాటుకుంటుంటారు. అదే మూగ జంతువుల విషయంలో మానవత్వం ప్రదర్శించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ప్రమాదానికి గురైన కోతిని కాపాడి మంచి మనసు చాటుకున్నారు ఓవ్యక్తి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి.. అపస్మారక స్థితిలో పడివున్న కోతి ప్రాణాలను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ చెట్టుకుంది గాయాలతో పడి ఉన్న కోతి పిల్ల కనిపించింది. కుక్కల దాడిలో ఆ కోతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. కునామ్కు చెందిన డ్రైవర్ ప్రభు బైక్ పై అటుపై వెళ్తుండగా.. ఈ విషయాన్ని గమనించి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ కోతి గుండెను పంపింగ్ చేయడం ప్రారంభించాడు.. ఆ తర్వాత దాని నోటిలో నోరు పెట్టి ఊపిరి అందించాడు. దీంతో ఆ కోతి ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. వెంటనే ఆ కోతిని తీసుకుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ కోతికి చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఆ కోతిని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధ రమేన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన తమిళ్ స్టార్ హీరో సూర్య తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ.. నమస్కారిస్తున్న ఎమోజీని షేర్ చేశారు. ఈనెల డిసెంబర్ 9న జరిగిన ఈ సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ప్రభుకు జేజేలు పలుకుతున్నారు.

There are people who still value every little life on this earth. Here Mr.Prabhu uses the first aid techniques he learned years back to resuscitate a 8 month old macaque which was attacked by a group of dogs
His swift action has saved the life of this little fella. @Thiruselvamts pic.twitter.com/bTHhIy5Km9— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) December 13, 2021

