మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమాన
– ర్యాలీలు, సభలకు అనుమతులు రద్దు
– ప్లబ్లిక్ ప్రాంతాల్లో నిబంధనలు పాటించాలి
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరులో కరోనా నిబంధనలు కఠినతరం చేయబోతున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వాటి నియంత్రణకు ప్రత్యేక జీవోలు అమల్లోకీ తీసుకవచ్చిందని అన్నారు. ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ జీఓ 10వ తేది వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు మాస్కును తప్పక ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. దుకాణాల నిర్వహకులు, షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లలో కరోనా నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని అన్నారు. దీంతో పాటు ప్రజలు కూడ ప్రజా రవాణా ప్రాంతాల్లో మాస్కులు తప్పక ధరించాలని, లేదంటే రూ.1000 జరిమాన విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ జీవో మేరకు తాండూరులో ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు రద్దుచేయడం జరిగిందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు ప్రజలు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

