ఉల్లి కాడలో గొప్ప ఔషధాలు..!
– కంటిచూపును మెరుగు పరిచే గుణాలు
– ఉబ్బసం, కీళ్లనొప్పులన్నీ దూరం
దర్శిని డెస్క్ : ఉల్లి కాడల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యకరమైన శరీరం కోసం మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలతో పాటు.. ఉల్లికాడలను కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. ఉల్లికాడలలో కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ ఉన్నాయి. కెలరీలు, కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్యను దూరం చేస్తుంది.
వ్యాధులపై పోరాటం
ఉల్లికాడలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయ పడుతుంది. అంతేకాకుండా గ్లూకోజ్ శక్తిని పెంచుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఉల్లికాడలలోని యాంటి హిస్టమైన్ పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉల్లికాడలలో స్ధూల పోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.
ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు దివ్య ఔషధంగా చెబుతారు.. ఉల్లి కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది.
ఉల్లికాడలలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది. గుండె, రక్తనాళాలకు మంచిది కావడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ బాధితులకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఇదికూడా చదవండి..

