నిర్ల‌క్ష్యం వ‌ద్దు.. అప్ర‌మ‌త్తం చేయండి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

నిర్ల‌క్ష్యం వ‌ద్దు.. అప్ర‌మ‌త్తం చేయండి
– జనావాసాల్లో శానిటైజ్ తప్పనిసరి
– మాస్కులు లేని వారికి రూ. వెయ్యి జరిమాన
– అధికారులు, నాయకుల సమీక్షలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో పెరుగుతున్న కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా అప్ర‌మ‌త్తం చేయాల‌ని చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఆశోక్ కుమార్ అధ్యక్షతన పోలీసు, మార్కెట్ కమిటి, మున్సిపల్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కరోనా పరిస్థితులపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, బట్టల దుకాణాలలో, మటన్ షాపులలో శానిటైజ్ చేయించేలా చూడాలని, ప్రతి రోజు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ. కులను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. మాస్కులు ధరించని, భౌతిక దూరం పాటించని వారిని రూ. వెయ్యి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ రవూఫ్ తదితరులు ఉన్నారు.