ఆదర్శ పట్టణ ప్రగతిపై దృష్టి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– వార్డుల్లో పర్యటించిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతితో తాండూరును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ 7,27,22, 21వ వార్డుల్లో పర్యటించారు. 7వ వార్డులోని బీసీ స్మశాన వాటికలోని ప్రహారి గోడకు పేరుకుపోయిన మట్టిని తొలగింపు చేయించారు.
మిగతా వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులు, పిచ్చి మొక్కలను తొలగించే పనులు చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా సమస్యలన్ని తెలుసుకోవడం జరుగుతుందున్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించి పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



