డోలో 650 అతిగా వాడితే ప్ర‌మాద‌మే..!

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

డోలో 650 అతిగా వాడితే ప్ర‌మాద‌మే..!
– గుండె, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం
– వైద్యుల స‌ల‌హా మేర‌కు వాడ‌క‌మే ఉత్త‌మం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఒక‌ప్ప‌డు జ్వ‌రమొచ్చినా.. త‌ల‌నొప్పి వ‌చ్చినా డోలో 650ని ప‌రిమితిగా వాడేవారు. ఎప్పుడైతే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించిందో వీటి వాడ‌కం పెరిగిపోయింది. ఫ‌స్ట్, సెంక‌డ్ వేవ్‌తో పాటు థ‌ర్డ్ వేవ్ ముప్పంటుకున్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో డోలో 650 పేరు మార్మోగిపోతుంది. భ‌యంతో కొంద‌రు స‌మ‌స్య‌ల‌తో ఇంకొంద‌రు ఈ ట్యాబ్లెట్‌ను తెగ‌వాడేస్తున్నారు. చాలా సులభంగా అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో త్వరగా ఫలితం ఉండడంతో దీని వాడకం బాగా పెరిగిపోయింది. అయితే వెనకా ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటున్న ఈ ట్యాబ్లెట్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.
650 ఎమ్‌జీ అంటే చాలా ఎక్కువ డోస్‌తో కూడుకున్న ట్యాబ్లెట్‌. ఈ ట్యాబ్లెట్‌ను ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే కడుపులో వికారం కలుగుతుంది. లోబీపీ ఉన్న వారిలో ఇక తల తిరగడం, నీరసంగా అనిపించడం, నిద్రమత్తుగా ఉండడం, మల బద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరీ పరిమితి మించితే ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొందరిలో గుండె కొట్టుకునే వేగం పెరగడం, నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక డోలోను ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే కొందరిలో మలబద్దకం, స్పృహ తప్పిపోతున్నట్లు భావన కలుగుతుంది. అలాగే నోరు పొడిగా మారిపోతుంది. కావున జ్వరం, ఒంటి నొప్పి, తలనొప్పి ఇత‌ర స‌మ‌స్య‌వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.