పార్టీతో పాటు ప్రజా సేవకు ముందుంటా
– టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజా సేవకు ముందుంటానని ఆ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులుగా హరిహరగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ పట్టణ కమిటి ఎన్నికలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు హరిహరగౌడ్‌ను పార్టీ పట్టణ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హరిహరగౌడ్ మాట్లాడుతూ పట్టణ కమిటిలో ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న సందర్భంగా మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కల్పించిన స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీకి చెడ్డపేరు రాకుండా నడుచుకుంటానని అన్నారు. తన హోదా మేరకు పట్టణంలో పార్టీ అభివృద్ధి పాటుపడతానని అన్నారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణ కమిటిలో సముచిత స్థానం దక్కించుకున్న ఇతర నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

