మోగిన బడిగంట..!

తాండూరు వికారాబాద్

మోగిన బడిగంట..!
– విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
– అవగాహన కల్పించిన ప్రజా ప్రతినిధులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రెండేళ్ల తరువాత విద్యాసంవత్సరం అనుకున్న సమయానికి ప్రారంభమయ్యింది. సోమవారం తాండూరులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. మొదటి రోజు మోగిన బడిగంటకు విద్యార్థులు తరలివచ్చారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికారు. తాండూరు: మండలం మల్కాపూర్ గ్రామంలోని పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులకు బడికి పంపిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు తాండూరు పట్టణంలో గాంధీనగర్ పాఠశాలను బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ సందర్శించారు. ప్రార్ధనా సమయంలో విద్యార్థులకు మాట్లాడుతూ చదువు ప్రాముఖ్యతను తెలిపారు. విద్యార్థులకు చక్కగా చదువుకోవాలని, ప్రతిరోజూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం వార్డులో పర్యటించి అంగన్ వాడి బడిబాటపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.