గంజాయి రహిత తాండూరే లక్ష్యం
– మాదకద్రవ్యాల నియంత్రణకు సహకరించాలి
– తాండూరు డిఎస్సీ లక్ష్మీనారాయణ
– ప్రజా ప్రతినిధులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరును గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా భావించాలని డీఎస్సీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్సీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో చీడగా మారిన గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వల్ల ఎందరో జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. దీనిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించి తాండూరును గంజాయి రహితంగా మారే ఎందుకు నిర్దేశించుకున్న లక్ష్యంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలకు పాల్పడితే సమాచారం అందించాలని, అందులో ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు ప్రభుత్వ నిషేధిత పాన్, గుట్కా విక్రయాలు, రవాణాపై కూడ సమాచారం అందించాలన్నారు. అంతేకాకుండా యువత మత్తుకు బానిసలు కాకుండా అవగాహన కల్పించాలన్నారు. యువత తల్లిదండ్రులను చైతన్య పరచాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు కాలనీలలో నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలులు మాట్లాడుతూ తాండూరును మత్తు, మాదక ద్రవ్యాల రహితంగా మారే చందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రభుత్వం పోలీసుశాఖలో చేపడుతున్న ఉద్యమంలో భాగస్వాముమై గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు న హకరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ఫ్లోర్ లీడర్లు శోభారాణి, సోమశేఖర్, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మంకాల రాఘవేందర్, ప్రభాకర్ గౌడ్, సాహు శ్రీలత, సంగీత ఠాకూర్, అస్లాం, వెంకన్నగౌడ్, ప్రవీణ్ గౌడ్, రాము, రవి, బోంబీనా, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ సలీం, బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, రజనీకాంత్, ఎంఐఎం నాయకులు రవూఫ్, తాండూరు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

