కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
– కల్వ సూజాతపై చర్యలు తీసుకోండి
– తాండూరు పోలీసులకు టీఆర్ఎస్ యువనాయకుల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తాండూరు టీఆర్ఎస్ పట్టణ యువనాయకులు అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాతపై ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ యువ నాయకులు ఈర్షాద్. ఎస్సీ సెల్ అధ్యక్షులు హనుమంతు, మైనార్టీ సెల్ సెక్రటరీ మొయిజ్, సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్, నాయకులు జాకీర్, ఇమ్ములతో కలిసి పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3న సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇష్టారాజ్యంగా మాట్లాడాడం మంచిది కాదన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించడం జరిగిందని తెలిపారు. కావున కల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎవరైనా సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.


