మోడల్ స్కూళ్లో ప్రవేశాలకు ఆహ్వానం
– ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. తాండూరు మండలం జినుగుర్తి సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తి చేసేందుకు 6వ తరగతితో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను నేటి నుంచి 10వ తేది వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్సీ వారికి రూ. 75ల రుసుము, ఓసీలకు రూ. 150ల రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు https://telanganams.cgg.gov.in/ లింక్ ఉపయోగించాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

