కృషీవలుడూ.. సీఎం కేసీఆర్..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

కృషీవలుడూ.. సీఎం కేసీఆర్..!
– తెలంగాణను నెంబర్ వన్ గా మార్చిన ఘనత ఆయనదే
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో రక్తదానం చేసిన ఎమ్మెల్యే
– రక్తదాన శిబిరానికి విశేష స్పందన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా మార్చిన కృషీవలుడూ సీఎం కేసీఆర్ అని తాండూరు ఎమ్మెల్యే ఎలెట్ రోహిత్ రెడ్డి ఉద్ఘాటించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తాండూరులో సీఎం కేసీఆర్ మూడు రోజుల జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి యువకులను, నాయకులను ఉత్తేజ పరిచారు. ఈ సంరద్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి, ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. ఢిల్లీ పీఠాన్ని కదలించి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల‌ దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు విజయదేవి, మంకాల రాఘవేందర్, ప్రవీణ్ గౌడ్, రాము, బోయరవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ రాజుగౌడ్, శ్రీనివాసాచారి. పట్లోళ్ల నర్సింలు, మహిళ నాయకురాలు శకుంతల, నాయకులు గోపాల్, ఇందర్ చెడ్ రాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.