కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ పేదింటి పెండ్లికి వరం
– సంక్షోభంలోనే సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట..
– చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలు పేదింటి ఆడపిల్ల పెండ్లిళ్లకు వరంగా మారాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్ పల్లి మండలానికి చెందిన 12 లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి జరిగిన ప్రభుత్వ సహకారం ఉండాలని, ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారు కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116/ అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, ఇందోల్ సర్పంచ్ రామ్ చందర్, సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, ఒగ్లాపురం రాజు, అన్న సాగర్ కృష్ణ, కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, లింగంపల్లి అనంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోసిన్, చందు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

