వచ్చే వినాయక చవితికి కొత్త రూల్..!
– పర్యావరణ పరిరక్షణ కోసం నిర్ణయం
– పాటించాలంటున్న హిందూ ఉత్సవ సమితి
– అందుకోసమే కాగ్నాలో వ్యర్థాల పూడికతీత పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితికి భారీ ఎత్తు అయిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకుండా.. మట్టి వినాయకులను ప్రతిష్టించాలని తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రెండు నెలల ముందుగానే తాండూరులో వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా చూడాలని దృష్టిసారిస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు.

గత సంవత్సరం యాలాల మండలం కోకట్ కాగ్నా వాగులో భారీ ఎత్తున పెద్ద పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల పూడికలు ఏర్పడ్డాయని తెలిపారు. సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక జేసీబీని ఏర్పాటు చేసి వ్యర్థాల పూడిక పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సారి వినాయక చవితి ఉత్సవాలలో పర్యావరణానికి పెద్ద పీట వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మండపాల నిర్వహకులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మండపాల నిర్వహకులు కూడా పీయూపీ విగ్రహాలు కాకుండా, పెద్ద పెద్ద విగ్రహాల జోలికి పోకుండా.. మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం ఎంతో శ్రేష్ఠం అని అన్నారు. నిమజ్జన సమయంలో కూడా పర్యావరణ సమతౌల్యత సాధ్యమవుతుందని అన్నారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అందరు భాగస్వాములు కావాలని కోరారు.

ఇదికూడా చదవండి…

