ఉక్రేయిన్ విద్యార్థుల‌కు ఆర్టీసీ ఆఫ‌ర్

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఉక్రేయిన్ విద్యార్థుల‌కు ఆర్టీసీ ఆఫ‌ర్
– స్వ‌గ్రామం వెళ్లేందుకు ఉచిత ప్రయాణం
– ప్ర‌క‌టించిన ఆర్టీసీ ఎండి సజ్జ‌నార్
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆధాయ మార్గాల‌ను కాదు ఆర్టీసీ అప్పుడ‌ప్పుడు మాన‌వ‌తా సేవా చ‌ర్య‌లను చేప‌డుతుంది. ఆర్టీసీ ఎండీగా స‌జ్జనార్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఈ మార్పులు క‌నిపిస్తుంది. ఉక్రెయిన్‌-రష్యా వార్ ఉద్రిక్త‌త‌ను రేకిస్తున్న త‌రుణంలో తెలంగాణలోని ఆర్టీసీ సంస్థ మంచి ఆఫ‌ర్ అందించ‌నుంది. యుద్దంలో చిక్కుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వారిని విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ విద్యార్థులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాష్ట్రంలోని వారి స్వగ్రామానికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ఉచితంగానే ప్రయాణించవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్‌ విమానాశ్రయంకు చేరుకున్న వారు ఎలాంటి టికెట్‌ తీసుకోకుండానే సొంతూరుకు ప్రయాణం చేయవచ్చని స్ప‌ష్టం చేశారు.. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఉచితంగా తీసుకొచ్చింది. ఆర్టీసీ అందిస్తున్న సేవ‌ల‌పై విద్యార్థుల త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.