వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి

తాండూరు వికారాబాద్

వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి
– క‌మ‌ణీయంగా స్వామివారి క‌ళ్యాణం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుక‌లు వైభోగంగా జ‌రిగాయి. గురువారం తెల్లవారుజామున స్వామివారికి పాలాభిషేకం పల్లకిసేవను భ‌క్తులు భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి వారి క‌ళ్యాణోత్సవంను వేధ మంత్రోచ్చ‌ర‌ణ‌ల మ‌ద్య క‌మ‌ణీయంగా జ‌రిగింది. ఆల‌య క‌మిటి ఆధ్వ‌ర్యంలో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రిపించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మ‌రోవైపు అయ్యప్ప స్వామి పడిపూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.