రూ. 52 వేల వేతనంతో మెడికల్ పోస్టుల భర్తి
– కాంట్రాక్టు పద్దతిన దరఖాస్తుల ఆహ్వానం
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ జిల్లా వైద్యాధికారి తుకారం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక యేడాది గడువుతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలోని 08 మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం కాంట్రాక్టు పద్దతిన భర్తి చేస్తున్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఎంబీబీఎస్ విద్యతో పాటు.. ఆ సర్టిఫికెట్ ఏపి లేదా టీఎస్ మెడికల్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు బయో – డాటాతో పాటు అన్ని సర్టిఫికెట్ల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు సాయంత్రం 5:00 గంటల లోపు దరఖాస్తులను జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో అందజేయాలని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు రూ.52,351/- వేతనం చెల్లించబడునని, అవసరమైన మార్గదర్శకాల కొరకు సంబంధిత వెబ్ సైట్ నుండి సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

