సర్కారు బడుల్లో ఎన్నికలు..!
– 29న ఎస్ఎంసీ కమిటిలకు సన్నాహాలు
– ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 29న రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ( స్కూల్ మేనేజ్‌మెంట్ – విద్యానిర్వహణ కమిటీలు) ఎన్నికలు నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో చివరిసారిగా 2019 డిసెంబరులో విద్యా కమిటీలను ఎన్నికలు జరగగా పాత కమిటీల పదవీ కాలాన్ని ఆరు నెలల చొప్పున పొడిగించుకుంటూ వస్తున్నారు.
తాజాగా నాలుగేళ్ల తర్వాత కొత్త కమిటీలను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనుంది. కొత్త కమిటిల పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు పాఠశాల ఈ ఎన్నికల్లో 1-8 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను ఎన్నుకుంటారు. చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణ పాఠశాలలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాలు, ఎయిడెడ్ తదితర మొత్తం 28,514 పాఠశాలలకు కొత్త కమిటీలను ఎన్నుకుంటారు.
ఇదికూడా చదవండి…

