అయ్యప్ప స్వాముల ఆగ్రహం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అయ్యప్ప స్వాముల ఆగ్రహం..!
– స్వామి జనన అనుచిత వాఖ్యలపై మండిపాటు
– వాఖ్యలు చేసిన బైరి నరేష్ పై చర్యలకు డిమాండ్
– పోలీసులకు వినతిపత్రం అందించిన అయ్యప్ప స్వాములు
– తాండూరు పట్టణంలో మానవహారంతో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప జననం పై అనుచిత వాఖ్యలు చేయడం పట్ల మండిపడ్డారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల వికారాబాద్ జిల్లా కోడంగల్ లో జరిగిన ఓ సమావేశంలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప జననంపై అనుచిత వాఖ్యలు చేశారు. దీనిని నిరసిస్తూ తాండూరు అయ్యప్ప స్వాములు దేవాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా వరకు చేరుకుని అక్కడ స్వాములంతా మానవహారం ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. స్వాములు చేపట్టిన నిరసనకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీగౌడ్, పట్టణ అధ్యక్షులు చేసి సుదర్శన్ గౌడ్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్వాములు, నేతలు మాట్లాడుతూ బైరీ నరేష్ అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వాఖ్యలు చేసి స్వాములు, ప్రజల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా, దేవుళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం, ఎగతాళి చేయడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లపై మతపరమైన వాఖ్యలు చేస్తూ చిచ్చు రాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వాఖ్యలు చేసిన బైరీ నరేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టలు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే బంద్లు, రాస్తారోకోలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు, హైందవ సోదరులు పాల్గొన్నారు.