మెగా లోక్ అదాలత్‌కు భారీ స్పంద‌న

క్రైం తాండూరు వికారాబాద్

మెగా లోక్ అదాలత్‌కు భారీ స్పంద‌న
– 408 కేసులు రాజీ చేసుకున్న క‌క్షిదారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు భారీ స్పంద‌న ల‌భించింది. శనివారం మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీస్వప్న ఆధ్వర్యంలో జ‌రిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 408 కేసుల‌ను క‌క్షిదారులు రాజీ కుదుర్చుకున్నారు. కక్షిదారులు రాజీ చేసుకున్న కేసుల వివ‌రాలిలా ఉన్నాయి. 44 సీసీ కేసులు, 313 భరణం, చెక్ బౌన్స్, న్యూసెన్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 48 నేరం ఒప్పుకోలు కేసులు, 2 గృహ హింస కేసులు, 1 సమ్మరీ ట్రేల్ కేసు, మొత్తం 408 కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కావలి రవిందర్, కార్యదర్శి పాశం రవికుమార్, లోక్ అదాలత్ మెంబర్లు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్ తిరుమల్, సీనియర్ న్యాయవాదులు మనోహర్ రావు, భవనస్ప, పి.శ్రీనివాస్, పి. రాంరెడ్డి, పి.మహేందర్ రెడ్డి, పి. గుండప్ప, కె.గోపాల్, కె. గోపాల్, బి. రవికుమార్, పీసీ రెడ్డి, మహిళ న్యాయవాదులు అనితా గుప్త, సోఫియా, వాణిశ్రీ, రజిత, అరుణ, మహమ్మదీ భేగం, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.