రైతుల పోలాలకు రాచమార్గం
– ఫలించిన రూరల్ సీఐ జలంధర్ రెడ్డి చొరవ
– గాజీపూర్‌లో 300 ఎకరాల భూములకు రోడ్డు నిర్మాణం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో రైతుల మద్య ఏర్పడిన సమస్యను తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి పరిష్కరించారు. సీఐ సమక్షంలో 300 ఎకరాలకు వ్యవసాయ పొలాల రాకపోకలకు రాచమార్గం చూపించారు. వివరాల్లోకి వెళితే… పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన పట్లోళ్ల వెంకట్ రెడ్డి,జనార్దన్ రెడ్డి, లాల్ రెడ్డి, రసూల్ చెందిన వ్యవసాయ పొలాల మధ్యనుంచి మట్టిరోడ్డు నిర్మాణం విషయంలో గతకొన్ని రోజుల నుంచి రైతులు సతమతమవుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. గ్రామ సర్పంచ్ వీరప్ప, రైతుల సమక్షంలో చర్చలు జరిపి రోడ్డు నిర్మాణానికి ఒప్పించారు. దీంతో వివాదం సమిసి పోవడంతో శుక్రవారం వ్యవసాయ పొలాల మద్య మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఎటువంటి గొడవలు లేకుండా సమస్యకు పరిష్కారం చూపించిన సీఐ జలంధర్ రెడ్డికి గ్రామస్తులు, రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరప్ప, ఎస్సై నాగరాజు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ యాదవ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు సంగమేశ్వర్, ఉప సర్పంచ్ వెంకటయ్య, గ్రామ అధ్యక్షుడు ముస్తాప్ప, నాయకులు గౌస్, గుండప్ప, రాంరెడ్డి, కృష్ణ, రైతులు హనుమంతు, చంద్రయ్య, లాలప్ప, రవి, రాములు తదితరులు ఉన్నారు.

