ఖబడ్దార్ బండి సంజయ్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఖబడ్దార్ బండి సంజయ్..!
– కేసీఆర్‌పై నోరు జారితే ఊరుకోం
– నిరాధార ఆరోపణలను సహించేది లేదు
– బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి
– బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులు బండి సంజయ్‌కు ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ లో జరిగిన సన్మాన సభలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గౌరవానికి భంగం కలిగేలా బండి సంజయ్ ఆరోపణలు చేయడం పట్ల మంగళవారం బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ నేత బండి సంజయ్ మా అధినేత మాజీ సీఎం కేసీఆర్‌పై బీహార్లో దొంగ నోట్ల ప్రెస్ పెట్టి అట్టి నోట్లని గత ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమన్నారు. తెలంగాణలో ఎలాంటి పాత్రలేని మీరు.. ఒక భాద్యత మైన పదవిలో ఉండి తెలంగాణ కోసం చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన కేసీఆర్‌పై వ్యాఖ్యలు సరికాదన్నారు. మరోసారి కేసీఆర్‌పై లేనిపోని చిల్లర మాటలు ఆడితే సహించేదిలేదని.. ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్వీ తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రంలో బీఆర్ఎస్వీ జిల్లా దత్తాత్రేయ, వినోద్, తేజ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు సమస్యలు పరిష్కరించండి