జిల్లా యువ‌త‌కు గుడ్ న్యూస్

కెరీర్ తాండూరు రంగారెడ్డి వికారాబాద్

జిల్లా యువ‌త‌కు గుడ్ న్యూస్
– పోలీస్ అభ్య‌ర్థుల కోసం ఉచిత కోచింగ్
– స‌ద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలోని నిరుద్యోగ యువ‌తీ, యువ‌కుల‌కు పోలీసు యంత్రాంగం శుభ‌వార్త చెప్పింది. ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టుల‌కు సిద్దమ‌వుతున్న నిరుద్యోగుల‌కు ఉచితంగా శిక్ష‌ణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో 18, 334 ఖాళీలు భర్తీ చేయ‌నున్న‌ట్లు అంద‌రికి తెలిసిందే. పోలీసు ఉద్యోగాల కోసం శిక్ష‌ణ పొందే యువ‌తీ, యువ‌కుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు అధికారులు సంక‌ల్పించారు. దీనిలో భాగంగా వికారాబాద్ డివిజన్ పరిధిలోని వికారాబాద్, ధారూర్, కోటపల్లి, బంట్వారం, మర్పల్లి, మోమిన్పేట్ మండలాలతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల‌కు సంబంధించిన నిరుద్యోగ యువకుల కోసం పోలీసుశాఖ ఆధ్వ‌ర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ శిబిరాన్నిఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు చెందిన‌ సబితా ఆనంద్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సౌజ‌న్యంతో హైదారాబాద్‌లోని ప్ర‌ముఖ కోచింగ్ ఇన్సుట్యూట్ నిపుణుల‌తో శిక్ష‌ణ శిబిరాన్ని నిర్వ‌హిస్తున్నారు. కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ అందించ‌డంతో పాటు మధ్యాహ్న భోజనవసతి కూడా కల్పిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనదలచిన నిరుద్యోగులు వారి వారి పేర్లను సంబంధిత మండల పోలీస్ స్టేషన్ అధికారుల వద్ద న‌మోదు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.
మండ‌లాల వారిగా పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాల్సిన వివ‌రాలు
1.వికారాబాద్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ -9440627354
2. ధరూర్ ఎస్ఐ -7893708357
3. బంట్వారం ఎస్ఐ -8374701471
4.కోటిపల్లి ఎస్ఐ -7901148912
5. మర్పల్లి ఎస్ఐ – 9441704404
6.మోమిన్పేట్ ఎస్ఐ – 9440627252
ఈ వార్త‌ను స‌మ‌ర్పించిన వారు