బాల్ బాల్‌కు బెట్టింగే..!

క్రీడలు క్రైం తాండూరు వికారాబాద్

బాల్ బాల్‌కు బెట్టింగే..!
– ఆన్‌లైన్‌లోనే అంతా
– ఐపీఎల్ లైవ్ లింకుల‌తో పెట్టుబ‌డి
– పెడ‌దారి ప‌డుతున్న యువ‌త‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశ‌వ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ చేస్తున్న సంద‌డి అంతా ఇంతా కాదు. గ‌త‌నెల 26 నుంచి ప్రారంభ‌మైన ఐపీఎల్ క్రికెట్‌కు అభిమానులు ఎంత‌మంది ఉన్నారో.. అందుటు ధీటుగా బెట్టింగ్ దారులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్‌కు సంబంధించి బెట్టింగ్ వ్య‌వ‌హారం జోరుగా కొన‌సాగుతోంది. తాండూరు ప్రాంతంలో కూడ ఈ సంస్కృతికి యువ‌త‌, పెద్ద‌లు బానిస‌ల‌వుతున్నారు. ఆన్‌లైన్ వేదిక‌గా సాగుతున్న బెట్టింగ్‌కు రూ. 100ల నుంచి వేలు, ల‌క్ష‌ల వ‌ర‌కు బెట్టింగ్‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా వ‌స్తున్న లైవ్ లింకుల‌తో బాల్ బాల్‌కు బెట్టింగ్ పెడుతున్నారు. తాండూరులో కొన్ని క్రికెట్ బెట్టింగ్ సైట్లు ఫేమ‌స్‌గా మారిపోయాయి. లింక్ ఒపెన్ చేస్తే బెట్టింగ్‌కు పాల్ప‌డే వారికి ప్ర‌త్యేక యూజ‌ర్ ఐడీ, ఫాస్ వ‌ర్డ్ అందించి కొంద‌రు బుకీలు వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డారు. ఇలాంటి ఇంకెన్నో లింకుల ద్వారా తాండూరు యువ‌త‌, పెద్ద‌లు బెట్టింగ్‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఫెవ‌రెట్ టీం, ఫెవ‌రేట్ ఆట‌గాడితో పాటు ప్ర‌తి బాల్‌కు, ప్ర‌తి వికెట్‌కు బెట్టింగ్ చేస్తూ పెడ‌దారి ప‌డుతున్నారు.

అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం
స‌ర‌దాగానో అల‌వాటు గానో ఎంతో మంది ఐపీఎల్ బెట్టింగ్‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ముందు ఆధాయం వ‌చ్చింద‌ని.. మొద‌లెట్టి అప్పుల పాలైనా బెట్టింగ్‌ను వ‌ద‌ల్లేని సంఘ‌ట‌న‌లు అంత‌ర్గ‌తంగా తాండూరులో చాలానే ఉన్నాయి. ఇలాంటి సంస్కృతికి బానిస‌లు కాకుండా అప్ర‌మ‌త్త‌త వ‌హించాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంది. ముఖ్యంగా క్రికెట్‌పై అవ‌గాహ‌న ఉన్న ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ విద్యార్థుల‌పై వారి వారి త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక దృష్టిసారించాలి. మ‌రోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసులు కూడ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో పాటు బెట్టింగ్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

బెట్టింగ్‌కు పాల్ప‌డిన సైట్