డిగ్రీ కళాశాల అభివృద్ధికి తోడ్పండి
– డిగ్రీ కళాశాల పూర్వవిద్యార్థుల కమిటి ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వి విద్యార్థుల కమిటి పూర్తి తోడ్పాటు అందించాలని కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.రవిందర్ అన్నారు. మంగళవారం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి కమిటిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ విద్యార్థుల సహాయం అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటైన కమిటి సభ్యులు కళాశాల అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. మరోవైపు కళాశాల పూర్వ విద్యార్థుల కమిటిలో అధ్యక్షులుగా బి.ఆరవింద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ హనీఫ్, ఉపాధ్యక్షులుగా ఎండీ అదీబ్, కోశాధికారిగా అబ్దుల్ రహమాన సభ్యులుగా సి.ధానమ్మ, ఎస్.ఆనంద్ు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ డా.వివేక్ కుమార్ దూబే. ఉర్దూ ఉపన్యాసకులు డా.అశ్రా ఉల్-హక్, అద్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

