కోట్రిక యాదిలో..!
– విద్యార్థులకు ఉచిత దంతవైద్య శిభిరం
– మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, సేవారత్న అవార్డు గ్రహీత, లయన్స్ క్లబ్ సభ్యులు కోట్రిక వెంకటయ్య స్మారాకార్థంలో ఆయన సతీమణీ కోట్రిక విజయలక్ష్మీ తరించారు. బుధవారం ఆయన వర్దంతి సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం నాగులపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారీ, లయన్స్ క్లబ్ సభ్యులు కోట్రిక వెంకటయ్య చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ కోట్రిక వెంకటయ్య సేవాస్పూర్తిని కొనసాగిస్తామన్నారు. అదేవిధంగా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారీలు మాట్లాడుతూ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా కోట్రిక వెంకటయ్య అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం వికారాబాద్ సాయి డెంటల్ కాలేజ్‌కు చెందిన డాక్టర్ భవ్యత ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు.

ఉదయం నుంచి పాఠశాలలోని 113 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు రోజూ రెండుసార్లు పళ్ళు తోముకోవాలని, భోజనం తర్వాత నోరు పుక్కిలించి ఉమ్మి వెయ్యాలని సూచించారు. అప్పుడే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు జయశ్రీ, కార్యదర్శి బసవప్ప, సోషల్ వర్కర్ వెంకట్, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎం మహ్మద్ వజీర్, రవీందర్, డాక్టర్లు శ్వేత, సాయి మౌనిక, సుసాన్, ఫాతిమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

