కార్మికులపట్ల మొండి వైఖరి వీడాలి
– సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరిని వీడాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు అన్నారు. పెంచిన వేతనాలను అమలు చేయాలని. డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం మూడో రోజుకు చేరుకుంది. పాత మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్ పర్సన్ ఎజెండా వ్యవహారంపై కోర్టుకు వెళ్లడంతో కార్మికులకు పెంచిన జీతాలు అమలు కావడం లేదన్నారు. కార్మికుల పట్ల మొండి వైఖరిని ప్రదర్శించరాదన్నారు. కార్మికులను దృష్టిలో ఉంచుకుని కోర్టుకు వెళ్లిన ఎజెండాను వెనక్కి తీసుకోవాలన్నారు. అదేవిధంగా 18 మంది కార్మికుల వేతనాలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ, S.C సెల్, B.C సెల్ నాయకులు, కౌన్సిలర్లు, NSUI నాయకులు పాల్గొన్నారు.

