సారూ.. నా కుమారుడు నన్ను పోషించడం లేదు
– తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో తల్లి మొర
తాండూరు, దర్శిని ప్రతినిధి : సారూ.. నవమాసాలు మోసి కనిపెంచిన నా కుమారుడు నన్ను పోషించడం లేదంటూ ఓ తల్లి తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు తన ఆవేధనను మొరపెట్టుకుంది. కుమారుడిపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని విజ్ఙప్తి చేసింది. వివరాల్లోకి వెళితే తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన అనసూజమ్మ ఒక కుమారుడు, నలుగురు కువర్తెలు ఉన్నారు. భర్త చనిపోయాడు. అయితే తన కుమారుడు అయిన వెంకట్ రెడ్డి తనను పోషించకుండా పట్టించుకోవడం లేదని గురువారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సీనియర్ సిటిజన్ కింద ఆర్డీట కార్యాలయంలోని డీఏఓ మహేష్ గౌడ కు ఫిర్యాదును అందజేసింది. తనను పోషించకుండా, పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తన కుమారుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని అధికారికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటామని తల్లికి భరోసా ఇచ్చారు.


