కార్మికులతో చెలగాటం తగదు

తాండూరు వికారాబాద్

కార్మికులతో చెలగాటం తగదు
-మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్
– రెండు రోజు మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో చెలగాటం ఆడ‌డం త‌గ‌ద‌ని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్ అన్నారు. మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది. శుక్రవారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరవధిక సమ్మెకు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ సమస్యను పరిష్కరించడం జరిగిందని అన్నారు. మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను చెల్లించాలన్నారు. ఎజెండా అంశాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి అధికారులు, నాయకులు చెలగాటడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్, డివిజన్ అధ్యక్షులు సందీప్ రెడ్డి, నాయకులు మహేష్ ఠాకూర్, మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు ఎం.గోపాల్, గోపాల్, అశోక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.