మనోహర్‌ రెడ్డి కృషితో మెజార్టీ స్థానాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

మనోహర్‌ రెడ్డి కృషితో మెజార్టీ స్థానాలు
– ఎమ్మెల్యేకు నేతల శుభాకాంక్షల వెల్లువ
– సన్మానించిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం), న్యాయవాది కె.గోపాల్‌లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల గెలుపులో తనతో పాటు పార్టీ నేతల సహకారం ఉందన్నారు.

గెలుపు, ఓటములు ఎన్నికల్లో సహజం అని అన్నారు. ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం) మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోల్ల నర్సిములు, జిలాని, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

తాండూరులో కాంగ్రెస్‌దే పైచేయి..!