రేపు తాండూరుకు మంత్రి స‌బితారెడ్డి రాక‌

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు మంత్రి స‌బితారెడ్డి రాక‌
– ఉచిత‌ కోచింగ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం
– రోట‌రీ క్ల‌బ్ ద్వారా స్కూళ్ల‌కు బేంచీల విత‌ర‌ణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సోమ‌వారం తాండూరుకు విచ్చేస్తున్నారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గ నిరుద్యోగ యువ‌త కోసం పోలీస్, టెట్, గ్రూపు 1,2,3,4 ఉద్యోగ‌వ‌కాశాలకు సంబంధించి ఉచితంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3-30 గంట‌ల‌కు మంత్రి స‌బితారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభిస్తారు. దీంతో పాటు రోట‌రీ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హ్యాపీ స్కూల్ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు బేంచీల‌ను అంద‌జేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రైతు బ‌జార్లోని మార్కెట్ క‌మిటి గోదాం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్ర‌జా ప్ర‌తినిధులు, కౌన్సిల‌ర్లు పాల్గొన‌నున్నారు.