బీసీ కులాలను ఓబీసీ జాబితాలోకి చేర్చాలి
– సెంట్రల్ బీసీ కమిషన్‌కు విన్నవించిన శుభప్రద్ పటేల్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను జాతీయ ఓబీసీలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ కోరారు. ఢీల్లీ పర్యటలో ఉన్న శుభప్రద్ పటేల్ బుధవారం జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్, తల్లోజి ఆచార్యాలతో శుభప్రద్ పటేల్ భేటి అయ్యారు. ఈ మేరకు శుభప్రద్ పటేల్ వారికి బీసీల సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. సెంట్రల్ ఓబీసీ జాబితాలో లేని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాలకు సంబంధించి, విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక స్థితిగతులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేశారు. తెలంగాణ బీసీ కమిషన్ తరపున జాతీయ బీసీ కమిషన్ కు బీసీ కులాల వెనుక బాటుతనానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా అందించడానికి తెలంగాణ బీసీ కమిషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరగా తెలంగాణ బీసీ కులాలని ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞాపన పత్రంలో కోరారు. అదేవిధంగా బీసీ కులాల వారికి సామాజిక ఆర్థిక విద్య పరంగా ఉన్నత స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని శుభప్రద్ పటేల్ జాతీయ బీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.


