జీఎన్ఆర్‌ను ప‌రామ‌ర్శించిన‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

జీఎన్ఆర్‌ను ప‌రామ‌ర్శించిన‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పెద్దేముల్ మండలంకు టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు గాజీపూర్ నారాయ‌ణ రెడ్డి(జీఎన్ఆర్‌)ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. సోమ‌వారం పెద్దేముల్ మండ‌లం గాజీపూర్ గ్రామంలోని నారాయ‌ణ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెళ్లారు. అక్క‌డ నారాయణరెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప‌రిస్థితిలోనూ ధైర్యంగా ఉండాల‌ని ఆయ‌న మ‌నోధైర్యం చెప్పారు. మ‌రోవైపు అదే మండ‌లంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డిని కూడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.