మామూలోల్లు కాదు.. ఈ మహారాష్ట్ర దొంగలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మామూలోల్లు కాదు.. ఈ మహారాష్ట్ర దొంగలు..!
– దొంగ బండిలో వచ్చి చోరీకి రిక్కీ
– చివరికి బోరు మోటార్ల ఆపహరణ
– చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
– వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మహారాష్ట్ర నుంచి ఓ దొంగ బండిలో వచ్చిన దొంగలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చోరీకి ప్లాన్ చేశారు. ఓ మెకానిక్ షాపులో బోరు మోటార్లను ఎత్తికెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కరణ్‌ కోట్ పోలీసులు నిందితులను చాకచక్యంగా గుర్తించారు. శుక్రవారం కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్‌ రెడ్డి కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలోని చౌరస్తాలో అదే గ్రామానికి చెందిన అవుసుల కిరణ్ కుమార్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే గత సెప్టెంబర్ మాసం 29న గుర్తుతెలియని వ్యక్తులు తన షాపు షెటర్ ధ్వంసం చేసి బోరు మోటార్లను ఎత్తుకెళ్లారు.

మరుసటి రోజు కిరణ్ కుమార్ కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సహాయంతో నిందితులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం అస్లాం, సాబేర్ అనే అనుమానితులను అదుపులోకి తీసుకుని వి చారించగా చోరీ మిస్టరీ వీడింది. మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన అస్లాం, సాబేర్ లు పీరు అలియాస్ ఫిరోజ్, షాదుల్లా అలియాస్ మాము, షేక్ జబ్బు, ఖయ్యూం అనే వ్యక్తులతో కలిసి నెంబర్ ప్లేట్ లేని డీసీఎం వాహనంలో తాండూరుకు వచ్చి చోరీకి ముందు రోజు రిక్కీ నిర్వహించారు.

ఇందులో భాగంగా కిరణ్ కుమార్ షాపులో బోరు మోటార్లను ఎత్తుకెళ్లినట్లు పట్టుబడిన అస్లాం, సాబేర్ లు నేరం అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి రూ. 50వేల నగదును స్వాదీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. వారిద్దరిని కోర్టులో పరచడం జరిగిందని తెలిపారు. మిగతా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ఇదికూడా చదవండి…

బీరప్ప స్వామి దేవాలయానికి భూమిపూజ