క్రీడా క్యాంపులతో నైపుణ్యాలు మెరుగు

క్రీడలు తాండూరు వికారాబాద్

క్రీడా క్యాంపులతో నైపుణ్యాలు మెరుగు
– ఎస్‌జీఎఫ్ తాండూరు జోన్ కార్యదర్శి ఆర్.కృష్ణయ్య
– తాండూరు వేధిక్ విశిష్ఠలో సమ్మర్ క్యాంపు ప్రారంభం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : క్రీడల్లో చురుకుగా పాల్గొంటే నైపుణ్యాలు మెరుగు పడతాయని ఎస్‌జీఎఫ్‌ తాండూరు జోన్ కార్యదర్శి ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలంగాణ స్పోర్ట్ అథారిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణంలోని వేధిక విశిష్ట స్కూల్లో వాలీబాల్ ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపును జోన్ కార్యదర్శి ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క‌రోనా వ‌ల్ల విద్యార్థులు ఆట‌ల‌కు దూర‌మ‌య్యార‌ని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తెలంగాణ స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 14 ఏండ్లు పైడిన విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్ సుహాస్, నాగభూషణం, కోచ్ రాములు, పీఈటి రాములు, బుగ్గప్ప, రాము, విద్యార్థులు పాల్గొన్నారు.