ఆసుపత్రికి ప్రాణవాయువు..!
– ఎంసీహెచ్‌కు, జిల్లా ఆసుపత్రికి ఆక్సీజన్ సిలిండర్లు
– వారంలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసపత్రికి ప్రాణవాయువు వచ్చింది. కేంద్రప్రభుత్వం పీఎం కేర్ నిధులతో జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్‌లకు ఆక్సీజన్ ప్లాంటుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న సిలిండర్లు బుధవారం జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇప్పటికే ఎంసీహెచ్‌తో పాటు జిల్లా ఆసుపత్రిలో ఆక్సీజన్ సిలిండర్ల కోసం షెడ్లను నిర్మించారు.

మరోవైపు జిల్లా ఆసుపత్రిలో అయితే వివిధ వార్డులలో రోగులకు ప్రాణవాయువును అందించేందకు గొట్టాలను ఏర్పాటు చేశారు. సిలిండర్ల రాకతో ఆస్తమాతో పాటు కరోనా రోగులకు ఆక్సీజన్ అందించేందుకు ఆసుపత్రి వైద్యాధికారులు దృష్టిసారిస్తున్నారు. మరో వారం రోజలలో టెక్నిషీయన్ల ద్వార బిగించి రోగులకు ప్రాణవాయువును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుప్రతి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి తెలిపారు.
![]()

