వాస‌వీ మాత సేవ‌లో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న

తాండూరు వికారాబాద్

వాస‌వీ మాత సేవ‌లో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న
– జ‌యంతిలో ప్ర‌త్యేక పూజ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆర్య‌వైశ్యుల కుల‌దైవం శ్రీ వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి మాత సేవ‌లో తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ త‌రించారు. బుధ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలో వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి జ‌యంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. న‌గ‌రేశ్వ‌ర ఆల‌యంలో వెల‌సిన అమ్మ‌వారిని చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. జ‌యంతి సంద‌ర్భంగా అమ్మ‌వారికి అమృత క‌ల‌శంతో పూజ‌ను కొన‌సాగించారు. అమ్మ‌వారికి క్షీరాభిషేకం చేశారు. కుంకుమార్చ‌న‌, క‌న్య‌ల పూజ‌, ప‌ల్ల‌కి సేవ ఊరేగింపులో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పాల్గొన్నారు. ప‌ల్ల‌కిసేవ ఊరేగింపులో అమ్మ‌వారి ప‌ల్ల‌కిని చైర్ ప‌ర్స‌న్ భ‌క్తుల‌తో క‌లిసి మోశారు. అనంత‌రం అన్న‌దాన కార్య‌క్ర‌మంలో భ‌క్తుల‌కు అన్న‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య చైర్మ‌న్ కుంచెం ముర‌ళిధ‌ర్‌, ఆర్య‌వైశ్య సంఘం, వాస‌వి మ‌హిళ సంఘం, ఆర్య‌వైశ్య యువ‌జ‌న సంఘం, వైశ్యఫెడ‌రేషన్, న‌గేశ్వ‌రేశ్వ‌ర భ‌జ‌న మండ‌లి స‌భ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు.