ఉద్యమానికి స్పూర్తి చాకలి ఐలమ్మ
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి వీరనారి చాకలి ఐలమ్మ స్పూర్తిగా నిలిచారని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో చాకలి ఐలమ్మ 126వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా
ఆమె మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళ ఉక్కు మహిళని అని ప్రశంసించారు.. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, రాము, వెంకన్నగౌడ్, ముక్తార్ నాజ్, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిడ్కర్ రఘు, టీఆర్ఎస్వీ నాయకులు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
