బాలిక‌ల బంగార భ‌విష్య‌త్తుకు తోడ్ప‌డాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

బాలిక‌ల బంగార భ‌విష్య‌త్తుకు తోడ్ప‌డాలి
– బాల్య వివాహాలు చేయ‌డం నేరం
– కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తుకు అంద‌రు తోడ్పాడు అందించాల‌ని తాండూరు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్ అన్నారు. మంగ‌ళ‌వారం ప‌ట్ట‌ణంలోని 25వ వార్డులో ఉన్న అంగ‌న్ వాడి కేంద్రంలో అంత‌ర్జాతీయ చైల్డ్ హెల్ప్ లైన్ దినోత్స‌వం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాక‌ర్ గౌడ్ ముఖ్య అథితిగా హాజ‌రై చైల్డ్ లైన్ ప్ర‌తినిధుల‌తో క‌లిసి బాల‌ల హ‌క్కులు, సంర‌క్ష‌ణ పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ గౌడ్ మాట్లాడుతూ బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తుకు అంద‌రు స‌హ‌క‌రించాల‌న్నారు. వారి ఇష్టాల‌ను గుర్తించి ఉన్న‌తంగా చ‌దివించాల‌న్నారు. చిన్నారులు కూడ చ‌క్క‌గా చ‌దువుకోవాల‌న్నారు. చిన్నారుల‌కు బాల్య వివాహాల‌ను చేయ‌డం చ‌ట్ట‌రిత్యా నేర‌మ‌న్నారు. వాటి నియంత్ర‌ణ‌కు అంద‌రు భాగ‌స్వాములు కావాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీడీపీఓ అరుణ‌, చైల్డ్ లైన్ ప్ర‌తినిధులు జ్యోతి, న‌ర్సింలు, అంగ‌న్ వాడి టీచ‌ర్లు సుజాత‌, ర‌త్న‌మాల‌, ఆశా వ‌ర్క‌ర్లు, ఆయాలు త‌దిత‌రులు పాల్గొన్నారు.