హనుమాన్ చాలీసాతో చింతలన్నీ దూరం
– ప్రతి రోజు ప్రతి ఒక్కరు పఠించాలి
– హిందూ ధార్మిక పరిషత్ కన్వినర్ గాజుల బస్వరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా జీవితంలో చింతలన్నీ దూరం అవుతాయని ° హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ అన్నారు. హిందూ ధార్మిక పరిషత్, శ్రీ నేతాజీ విద్యా భవన్ ఆధ్వర్యంలో గత నెలరోజులుగా చిన్నరులకు నిరవించిన హనుమాన్ చాలీసా పఠనం, భగవద్గీత శ్లోకాల పఠనం శిభిరం శనివారం ముగిసింది.
ఈ సందర్భంగా నెల రోజుల పాట్ చిన్నారులకు హనుమాన్ చాలీసా నేర్పించిన ఉపాధ్యాయురాలు అనురాధను నిర్వహకులు సన్మానించారు. ముగింపు సందర్భంగా చిన్నారులు ఆలాపించిన హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు ఆకట్టుకున్నారు. అనంతరం హిందూ ధార్మిక పరిషత్ కన్వినర్ గాజుల బస్వరాజ్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఆర్థికం, అనారోగ్యం, ఇతర సమస్యలు ఏమైనా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అన్ని సమస్యలు దూరం అవుతాయన్నారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణ పఠనం అలవర్చుకొ వాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు వేణుగోపాల్ రెడ్డి, పటేల్ విజయ్ కుమార్, రమేష్, పాఠశాల యజమాన్యం మణిమాల, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…