బీజేపీ అంటేనే మోసం
– ఆ పార్టీని ఎవ్వరు నమ్మరు
– టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ అంటేనే మోసం అని, ఆ పార్టీని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథపై చిత్త శుద్ది లేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు చేసిన విమర్శలు అర్ధరహితమని అఫ్పూ(నయూం) శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 8 ఏండ్లలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలించిందన్నారు. తెలంగాణ రాష్ట్రా నికి బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. ఆ పార్టీని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సహాకారంతో అన్ని వార్డులకు ఇంటింటికి మిషన్ భగీరథ నీరందేలా దృష్టిసారిస్తున్నారని. తెలిపారు. పట్టణంలో మిషన్ భగీరథ పనులు కొసాగుతన్నాయని, త్వరలో ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓర్వలేని విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.



