పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత‌

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత‌
– తాండూరు మున్సిప‌ల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: సీఎం స‌హాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ప‌థ‌కం పేద ప్ర‌జ‌ల ఆరోగ్యానికి చేయూత‌ను అందిస్తోంద‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స‌హాకారంతో ప‌ట్ట‌ణంలోని ఇందిరాన‌గ‌ర్, సాయిపూర్, సీతారంపేట్, మ‌ల్‌రెడ్డిప‌ల్లి ప్రాంతాల‌కు చెందిన ఐదు మంది ల‌బ్దిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ ప‌థ‌కం కింద రూ. 1ల‌క్ష 80 వేల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. మంగ‌ళ‌వారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి పాలనలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయ‌న్నారు. పేద‌రికంతో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోని పేద‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం స‌హాయ‌నిధితో చేయూత‌నందిస్తున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈప‌థ‌కాన్ని అర్హులైన పేద‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.