వృద్దురాలు సజీవ దహనం
– అగ్నిప్రమాదం సంబంవించి ప్రమాదం
– బషీరాబాద్ మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మంటల్లో కాలి ఓ వృద్దురాలు సజీవ దహనమయ్యింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంఓ ఈ విషాదకర సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మైల్వార్ గ్రామానికి చెందిన శాంతమ్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద వశాత్తు శాంతమ్మకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లోనే ఆమె సజీవ దహనం అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న బషీరాబాధ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ సంఘటన ప్రమాద వశాత్తు జరిగిందా.. కావాలనే చేశారా.. అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

