రేపే ఇంటర్ ఫలితాలు
– ప్రకటించిన ఇంటర్ బోర్డు
– విడుదల చేయనున్న మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఇంటర్ ఫలితాల తేది ఎట్టకేలకు ఖరారైంది. రేపు మంగళవారం (జూన్ 28)న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నాట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారి ఓమర్ జలీల్ వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడాలని సూచించారు. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. అందులో 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు, 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరంతా ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో పరీక్షలు రాశారని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని సూచించారు.



